తప్పు ఎకౌంటు కి నగదును పంపించారా ?ఇక్కడ మీకు,మీకుగా ఎలా సహాయం చేసుకోవచ్చో తెలుసుకోండి

మేము, పేటీఎం వద్ద, మీ కోసం వేగమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందించడానికి అత్యుతమ ప్రయత్నాన్ని చేస్తాము.మీ స్నేహితులకు /కుటుంబ సభ్యులకు నగదును బదిలీ చేస్తునప్పుడు ,సరైన గ్రహీత వివరాలను ఎంటర్ చేసారో లేదో అని డబల్ చెక్ చెయ్యడం మీ బాధ్యత.

పేటీఏం ద్వారా ఒక వ్యక్తికి ఒకసారి బదిలీ చేయబడిన ఫండ్స్ క్లెయిమ్ లేదా వాపస్సు చెయ్యబడదు.

వివిధ నియంత్రణ సంస్థలు స్పష్టం చేసిది ఏంటంటే అటువంటి నిధులను ఎవరూ క్లెయిమ్ చేయలేరు లేదా రివర్స్ చేయలేరు అది కేవలం ఖాతా యజమాని మాత్రమే అటువంటి నిధులను ఉపసంహరించుకోవడానికి బ్యాంకుకు అనుమతి ఇవ్వవచ్చు .నిధులను బదిలీ చేయడానికి కొనసాగించే ముందు, మీరు ఎటువంటి బదిలీ మోడ్ ని అయ్యిన ఎన్నుకోండి , కాని మల్లి ఒక్కసారి నిర్ధారించుకోడానికి గ్రహీత వివరాలను సరి చూసుకోని అప్పుడే నగదును బదిలీ కి కొనసాగమని మేము గట్టిగా సలహా ఇస్తున్నాము.

మీరు మీ స్నేహితులు/కుటుంబ సభ్యులకు క్రింద ఇవ్వబడిన మార్గాల ద్వార నగదును బదిలీ చెయ్యవచ్చు లేదా పంపవచ్చు:

1. పేటీఎం వాల్లేట్ నుండి పేటీఎం వాల్లేట్ కి

2. పేటీఎం వాల్లేట్ నుండి బ్యాంకు ఎకౌంటు కి

3. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఎకౌంటు నుండి ఇతర బ్యాంకు ఎకౌంటులకి

4. UPI ద్వార లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుండి ఇతర బ్యాంకు ఖాతాలు / VPA కు

ఒకసారి మీరు నగదు బదిలీని పూర్తి చేశాక ,వెంటనే నగదు గ్రహీత ఎకౌంటు లో జమ చెయ్యబడుతుంది.వివిధ నియంత్రణ సంస్థలు స్పష్టం చేసిది ఏంటంటే అటువంటి నిధులను ఎవరూ క్లెయిమ్ చేయలేరు లేదా రివర్స్ చేయలేరు అది కేవలం ఖాతా యజమాని మాత్రమే అటువంటి నిధులను ఉపసంహరించుకోవడానికి బ్యాంకుకు అనుమతి ఇవ్వవచ్చు .

ఒకవేళ మీరు తప్పుడు వ్యక్తికి నిధులు పంపినట్లయితే, ఆ వ్యక్తికి నేరుగా చేరుకోని , మీ నిధులను తిరిగి ఇవ్వామని అతని కోరండి.మీరు ఆ వ్యక్తిని చేరుకోలేక పోయినట్లయితే, సమన్వయం కోసం తన వివరాలను పొందడానికి రిసీవర్ నేరుగా బ్యాంకును సంప్రదించవచ్చు.మీరు గనుక గ్రహితతో మాట్లాడలేక పోతే, మీరు 24×7 Help ద్వారా పేటీఎం ను సంప్రదించాలి.

కొన్ని కేసులలో గ్రహీతకు పేటీఎం లో పేటీఎం వాల్లెట్ లేదా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ను కలిగి వుంటే మేము గ్రహీతను సంప్రదించి ,అతని సమ్మతి తో నగదును రివర్స్ చెయ్యడానికి మా వొంతు ప్రయత్నం చేస్తాము.

కొన్ని కేసులలో పేటీఎం తో ఖాతా కలిగి ఉండని రిసీవర్ కోసం మేము రిసీవర్ యొక్క బ్యాంకును సమీక్షిస్తాము , వారు అతనితో సమన్వయంని కలిగి ఉంటారు.ఒకవేళ గ్రహీత గనుక సమ్మతిని తెలియజేస్తే ,వెంటనే నగదు మీ ఎకౌంటు కి వాపస్సు వెళ్ళుతుంది.గ్రహీత కనుక సమ్మతిని తెలపకపోతే మీ ముందు వున్న ప్రత్యామ్నాయం పోలీస్ లేదా చట్టం సహాయం తీసుకోవడమే.

చివరకు మీరు గ్రహితను చేరుకోని, మీ నిధులను తిరిగి ఇవ్వడానికి అతను / ఆమె సమ్మతి కోసం అడగడానికి ప్రయత్నించాలని గుర్తుంచుకోండి. అన్ని సంస్థలు, మీకు,గ్రహీత కి త్వరగతిన సహాయం చెయ్యడానికి ముందుకువస్తాయి ,ఐతే నిధులను తిరిగి పొందడం లో మీ అవసరం బట్టి సమయపాలన పెరగవచ్చు.(ఉదా: నిధులు వెనకి రప్పించడం లో గ్రహీత తో బ్యాంకు సమన్వయం చేసుకోడానికి 30 రోజుల సమయం పట్టవచ్చు).

మీరు బదిలీ చేయడానికి ముందు మీరు వివరాలను పునఃప్రామాణీకరించినట్లు నిర్ధారించుకోవడానికి మేము కొన్ని మెళుకువలను ఉంచాము, కానీ మీరు ఇటువంటి విధానాలని ఉపయోగించడానికి మీ బాధ్యతగా నిధులను బదిలీ చేసినప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి.